ఒకటే సినిమా ఐదు 100 మిలియన్ లు.!

ఒకటే సినిమా ఐదు 100 మిలియన్ లు.!

Published on Jul 28, 2020 3:33 PM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కించిన తాజా చిత్రం “అల వైకుంఠపురములో”. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే దీనికి ముందు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో “అరవింద సమేత” కు సంగీతం అందించిన థమన్ నుంచి ఒక సరికొత్త థమన్ ను పరిచయం చేసిన త్రివిక్రమ్ ఈ చిత్రానికి కూడా సంగీత దర్శకునిగా తీసుకున్నారు. అదే ఫ్లో లో ఈ సినిమాకు కూడా అదిరిపోయే ట్యూన్స్ ను అందించారు.

కానీ ఈ చిత్రంలో ఒక్కో పాట ఒకదానిని మించి మరొకటి భారీ హిట్ అయ్యాయి. అయితే ఈ చిత్రంలో సూపర్ హిట్ ట్రాక్స్ లో ఒకటైన “సామజవరగమన” వీడియో సాంగ్ 100 మిలియన్ వ్యూస్ అందుకోవడంతో పాటు కేవలం ఈ ఒక్క సినిమా నుంచే మొత్తం ఐదు వీడియోలు ఒక్కొక్కటి 100 మిలియన్ వ్యూస్ అందుకున్నాయి. సామజవరగమన మరియు “రాములో రాముల” లిరికల్, వీడియో సాంగ్స్ తో పాటుగా బుట్ట బొమ్మ సాంగ్ 100 మిలియన్ వ్యూస్ అందుకోవడంతో ఒకే సినిమా నుంచి 5 సాంగ్స్ 100 మిలియన్ వ్యూస్ అందుకోవడం రీజనల్ గా ఒక రికార్డ్ అని చెప్పాలి.

తాజా వార్తలు