ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా రానున్న తాజా సినిమా ‘రెడ్’. సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత రామ్ హీరోగా వస్తోన్న ఈ చిత్రాన్ని మొదట ఏప్రిల్ సెకెండ్ వీక్ లో విడుదల చేయాలనుకున్నా.. కరోనా దెబ్బకు పోస్ట్ ఫోన్ అయింది. పైగా ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా తెలియకుండా పోయింది. కాబట్టి ఈ సినిమాని డైరెక్ట్ గా డిజిటల్ లో రిలీజ్ చేయటానికి ఓ ఓటిటి ప్లాట్ ఫామ్ భారీ మొత్తాన్ని ఆఫర్ చేస్తోంది.
కానీ చిత్రబృందం ఆ ఆఫర్ ను రిజక్ట్ చేసింది. ఓటిటీలో రిలీజ్ చేయము అని మేకర్స్ కూడా ఆ మధ్య స్పష్టం చేశారు. అయితే ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయ్యే పరిస్థితి ఈ ఏడాది ఉండేలా లేదు. అందుకే తాజాగా మేకర్స్ కూడా రిలీజ్ విషయంలో నిర్ణయం మార్చుకున్నట్లు తెలుస్తోంది. డిజిటల్ ప్లాట్ ఫామ్స్ ఆఫర్స్ ను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. సినిమా స్థాయికి తగ్గ రేట్ వస్తే ఇవ్వడానికి మేకర్స్ రెడీగా ఉన్నారట. అన్ని కుదిరితే దసరాకి ఓటిటిలో రెడ్ రిలీజ్ ఉండొచ్చు.
మొత్తానికి కరోనా సినిమాలకు బాగా నష్టం చేస్తోంది. ఇక ఈ సినిమాలో బ్యూటీ హెబ్బా పటేల్ సెకెండ్ హాఫ్ లో వచ్చే ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది. తిరుమల కిషోర్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా సమీర్ రెడ్డి ఛాయాగ్రహణం అందిస్తున్నారు.