జపాన్ లో ఎన్టీఆర్ క్రేజ్ పీక్స్, ఇదే ప్రూఫ్..!

జపాన్ లో ఎన్టీఆర్ క్రేజ్ పీక్స్, ఇదే ప్రూఫ్..!

Published on Jul 26, 2020 3:32 PM IST

టాలీవుడ్ హీరోల ఇమేజ్ ఎల్లలు దాటిపోతుంది. ఇతర రాష్ట్రాలలోనే కాకుండా, ఇతర దేశాలలో కూడా మన హీరోల సినిమాలు, సాంగ్స్ సందడి చేస్తున్నాయి. ముఖ్యంగా జపనీయులు ఇండియన్ సినిమాలను బాగా ఇష్టపడతారు. రజిని కాంత్ నటించిన ముత్తు మూవీ అప్పట్లో అక్కడ భారీ వసూళ్లు అందుకుంది. కాగా జపనీయులకు తెలిసిన హీరోలలో మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు. జపాన్ దేశంలో ఆయనకు ఫ్యాన్స్ కూడా ఉన్నారని సమాచారం. కాగా ఓ జపాన్ జంట ఎన్టీఆర్ సాంగ్స్ పై వరుస వీడియోలు చేస్తున్నారు.

కొద్దిరోజుల క్రితం ఈ జపనీస్ డాన్సింగ్ పెయిర్ అశోక్ సినిమాలో ఎన్టీఆర్, సమీరా రెడ్డి కలిసిన చేసిన ‘ గోలా గోలా’ సాంగ్ కి స్టెప్స్ వేసి అలరించారు. ఆ వీడియో అప్పట్లో పిచ్చ వైరల్ అయ్యింది. తాజాగా ఎన్టీఆర్ ఇండస్ట్రీ హిట్ సింహాద్రి మూవీలోని ‘చీమ చీమ’ సాంగ్ కి స్టెప్స్ వేసి ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎన్టీఆర్ ఫాన్స్ మాత్రం జపాన్ లో తమ హీరో క్రేజ్ చూసి ముచ్చట పడిపోతున్నారు.

తాజా వార్తలు