కొరటాల నిర్మాణంలో టీనేజ్ లవ్ డ్రామా !

కొరటాల నిర్మాణంలో టీనేజ్ లవ్ డ్రామా !

Published on Jul 26, 2020 1:57 AM IST


సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ నిర్మాతగా మారబోతున్న సంగతి తెలిసిందే. తన అసిస్టెంట్ కిరణ్ అనే నూతన దర్శకుడికి అవకాశం ఇస్తూ ఆహా కోసం ఓ వెబ్ సిరీస్ ను నిర్మించబోతున్నాడు. పైగా ఈ సిరీస్ కి కొరటాలనే స్వయంగా స్క్రిప్ట్ ను రాస్తున్నాడు. టినేజ్ లవ్ వల్ల లైఫ్ ఎలా డిస్టర్బ్ అవుతుందనే పాయింట్ మీద వెబ్ సిరీస్ నడుస్తోందట.

ఇక ప్రస్తుతం కొరటాల దర్శకత్వంలో మెగాస్టార్ హీరోగా ఆచార్య సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. తన శైలిలోనే ఈ సినిమా సాగనుంది. రాష్ట్రంలోని దేవాలయాలతో పాటు అనేక ఇతర మతపరమైన కార్యకలాపాలకు సంబంధించిన ఎండోమెంట్స్ విభాగానికి చెందిన గవర్నమెంట్ ఆఫీసర్ గా మెగాస్టార్ ఈ సినిమాలో కనిపించబోతున్నారు. చరణ్ నిర్మాణంలో వస్తోన్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.

కరోనా దెబ్బకు ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇప్పట్లో మొదలై పరిస్థితి కనబడటం లేదు. అయితే అక్టోబర్ నుండి రామోజీ ఫిల్మ్ సిటీలో వరుసగా ఇరవై ఐదు రోజులు పాటు సినిమాలోని కొన్ని కీలకమైన సీన్స్ ను షూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ అప్పుడు కూడా కేసులు మరీ ఎక్కువగా ఉంటే మాత్రం షూట్ ప్లాన్ ను విరమించుకుంటారు.

తాజా వార్తలు