పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాతుర్మాస దీక్షలో ఉన్నారు. అందుకే ఆయన ఎక్కువగా తన ఫార్మ్ హౌస్ లోనే గడుపుతున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ పొలిటికల్ విషయాలపై ఓ ఇంటర్వ్యూ ద్వారా స్పందించారు. ఆ సంధర్భంగా మూవీ షూటింగ్స్ గురించి అడిగితే ఆయన ఆసక్తి సమాధానం చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న కారణంగా ఇప్పట్లో షూటింగ్స్ కస్టమే అన్నారు. ప్రముఖులు కూడా దీని బారినపడుతున్నారన్న పవన్ కళ్యాణ్… సామాజిక దూరం పాటిస్తూ షూటింగ్స్ కి దూరంగా ఉండడమే మంచిది అన్నారు.
ఆయన అభిప్రాయంలో షూటింగ్స్ ఇప్పట్లో మొదలుకావడం కష్టమే అన్నట్లు చెప్పారు. దీనితో వకీల్ సాబ్ ఈ ఏడాది రావడం కష్టమే అని అర్థం అవుతుంది. వాక్సిన్ వచ్చే వరకు ఇలాంటి వాటికి దూరంగా ఉండడమే మంచిది అని ఆయన అనడం, ఇప్పట్లో ఆయనకు షూటింగ్స్ లో పాల్గొనే ఆలోచన లేదని అర్థం అవుతుంది. 20 రోజుల షూట్ మాత్రమే వకీల్ సాబ్ చిత్రీకరణకు మిగిలి ఉండగా, పూర్తి చేసిమూవీ విడుదలచేస్తే చూడాలని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.