యంగ్ హీరో నాగశౌర్య తన లేటెస్ట్ లుక్ తో అందరినీ షాక్ కి గురిచేశాడు. తన లేటెస్ట్ మూవీ కోసం ఆయన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చూస్తే ఎవరికైనా మతిపోవలసిందే. ఒకప్పుడు లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న నాగ శౌర్య మాస్ హీరో లుక్ లో దర్శనమిచ్చారు. కష్టపడి ఆయన పర్ఫెక్ట్ బాడీ సాధించారు. షర్ట్ లేకుండా నాగ శౌర్య కండల శరీరం మెస్మరైజ్ చేసేలా ఉంది. నాగ శౌర్య నెక్స్ట్ ఓ స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తుండగా ఆ మూవీ కోసం ఇలా తయారయ్యాడు.
ఈ మూవీ ఫస్ట్ లుక్ మే 27న ఉదయం 9:00 గంటలకు విడుదల కానుంది. నేడు ప్రీ లుక్ విడుదల చేసిన చిత్ర యూనిట్ దీనిపై అధికారిక ప్రకటన చేయడం జరిగింది. నాగ శౌర్య ప్రీ లుక్ విశేష ఆదరణ దక్కించుకుంది. ఇక ఆర్చరీ స్పోర్ట్స్ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కుతుండగా నాగ శౌర్య విలుకాడు వలె కనిపిస్తాడట. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో నారాయణ్ దాస్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ నిర్మాతలు గా శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్ మీద నిర్మిస్తున్నారు. కేతిక శర్మ ఈ మూవీలో నాగ శౌర్యకు జంటగా నటిస్తున్నారు.