కరోనా మహమ్మారి సినీ ప్రపంచంలో మార్పులు తీసుకువచ్చిందనుకుంటే.. సినిమా స్టార్స్ లో కూడా మార్పులు తీసుకువచ్చింది. మొహానికి రంగు వేసుకుని యాక్షన్ కట్ ల మధ్య బిజీ బిజీగా ఉండే సూపర్ స్టార్స్ కరోనా దెబ్బకు తమలోని మరో యాంగిల్ ను బయట పెడుతున్నారు. ‘వ్యవసాయం’లోనే సాయం ఉందని ఓ సినీ కవి చెప్పినట్టు.. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ వ్యవసాయం బాట పట్టారు.
బాలీవుడ్ కే టాప్ స్టార్ పైగా నేటి స్టార్ డమ్ మేటి హీరో అయిన ‘సల్మాన్ ఖాన్’ రైతు అవతారం ఎత్తి తన పొలాన్ని దున్నుతూ వ్యవసాయం చేసేస్తున్నాడు. సల్మాన్ ఖాన్ మొదట నుండి ఏ పని వినూత్నంగానే ఉంటుంది. ఇక కెరీర్ లో చాలా కష్టపడి బాలీవుడ్ లోనే స్టార్ హీరోగా ఎదిగారు సల్లూ భాయ్.
అయితే ప్రస్తుతం దొరికిన ఖాళీ సమయాన్ని ఎంతో చక్కగా ఆస్వాదిస్తున్నారు. గత కొన్నేళ్లుగా షూటింగ్ లతో ఎప్పుడూ బిజీగా ఉండే సల్మాన్ ఖాన్ కి, లాక్ డౌన్ పెద్ద ఉపశమనంగా మారింది. కరోనా మహమ్మారి నుంచి దేశాన్ని కాపాడేందుకు విధించిన లాక్ డౌన్ సామాన్యులకు కష్టాలను తెచ్చినా, ప్రముఖులకు మాత్రం వారి గతాన్ని గుర్తు తెచ్చుకుంటూ వారి ఇష్టాలను తీర్చుకునే గొప్ప అవకాశాన్ని కల్పించింది.
https://www.instagram.com/p/CC1XXiElTKp/?igshid=1d5m9aojwwj42