మెగా రీమేక్ పై కొత్త రూమర్ !

మెగా రీమేక్ పై కొత్త రూమర్ !

Published on Jul 19, 2020 8:35 PM IST

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ సూపర్ హిట్ మూవీ ‘లూసిఫర్’ను తెలుగులోకి మెగాస్టార్ చిరంజీవి రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. దర్శకుడు సుజీత్ దర్శకత్వం వహించబోతున్న ఈ సినిమా పై ఇప్పుడు ఓ వార్త హాల్ చల్ చేస్తోంది. మెగాస్టార్ ఈ సినిమా విషయంలో ఆలోచనలో పడ్డారని, పొలిటికల్ నేపథ్యంతో సాగే ఈ సినిమా చేయకపోతేనే బెటర్ అనే ఉద్దేశ్యంతో చిరు ఉన్నారని తాజాగా సోషల్ మీడియాలో రూమర్స్ మొదలయ్యాయి . మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకూ ఆగాల్సిందే.

ఇక తెలుగు ఆడియన్స్ కోరుకునే ఎమోషన్స్ కి తగ్గట్టుగా లూసిఫెర్ స్క్రిప్ట్‌లో కొన్ని కీలకమైన మార్పులు చేశారని.. ముఖ్యంగా హీరోయిజమ్ ఎలివేషన్స్ ఉన్న సన్నివేశాలు సినిమాలోనే మెయిన్ హైలైట్ గా నిలిచేలా సుజిత్ ప్లాన్ చేస్తున్నాడని మరో పక్క వార్తలు వస్తున్నాయి. మరి మెగా అభిమానులకు ఈ సినిమా పై మెగాస్టార్ చిరంజీవినే క్లారిటీ ఇస్తే బాగుంటుంది.

తాజా వార్తలు