టాలీవుడ్ హీరోలు సోషల్ మీడియా ఫాలోయింగ్ లో సత్తా చాటుతున్నారు. ఏకంగా కోలీవుడ్, స్టార్స్ ని కూడా కాదని సత్తా చాటుతున్నారు. ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమాలైన పేస్ బుక్, ట్విట్టర్ మరియు ఇంస్టాగ్రామ్ వేదికలపై టాలీవుడ్ స్టార్స్ సౌత్ ఇండియా రికార్డ్స్ కొట్టారు. సౌత్ ఇండియాలో మరే స్టార్ హీరోకి లేని ఫాలోవర్స్ ని వీరు సొంతం చేసుకున్నారు. మహేష్ బాబు ట్విట్టర్ లో ఈ రికార్డు నెలకొల్పాడు. 10 మిలియన్ ఫాలోవర్స్ కలిగిన మహేష్ ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నారు. ఈ విషయంలో మహేష్ సమీపంలో ఎవరూ లేరు.
ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పేస్ బుక్ లో 16 మిలియన్స్ ఫాలోవర్స్ తో సౌత్ ఇండియా రికార్డు కొట్టారు. ప్రభాస్ కి ట్విట్టర్ అకౌంట్ లేకపోవడం విశేషం. పేస్ బుక్ లో ప్రభాస్ ది సౌత్ ఇండియా వైడ్ గా బారి రికార్డు. టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ ఈ రికార్డు ఇంస్టాగ్రామ్ లో నెలకొల్పాడు. 8 మిలియన్స్ ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ ని కలిగివున్న విజయ్ దేవరకొండ ఆ ఫీట్ సాధించిన మొదటి సౌత్ ఇండియన్ హీరోగా రికార్డుకు ఎక్కాడు. ఈ మూడు సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ లో సౌత్ ఇండియా రికార్డ్స్ టాలీవుడ్ హీరోలు సొంతం చేసుకోవడం విశేషం.