“కేజీయఫ్” కు ఇక్కడే దెబ్బ పడిందా..?

“కేజీయఫ్” కు ఇక్కడే దెబ్బ పడిందా..?

Published on Jul 17, 2020 2:21 PM IST

కన్నడ రాకింగ్ స్టార్ యష్ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ ఎంటర్టైనర్ చిత్రం “కేజీయఫ్”. ఈ సినిమాతో దక్షిణాది సినిమా స్టామినా ఇండియన్ ఫిల్మ్ లవర్స్ రుచి చూసారు. ఊహించని రీతిలో ఈ చిత్రానికి మాస్ ఆడియన్స్ కావడంతో విడుదలైన అన్ని చోట్లా ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో మొత్తం దేశం అంతా ఈ చిత్రం హాట్ టాపిక్ అయ్యింది. అయితే ఈ సినిమా ఒక్క సిల్వర్ స్క్రీన్ పై మాత్రమే కాకుండా డిజిటల్ గా కూడా మోస్ట్ వ్యూడ్ ఇండియన్ ఫిల్మ్ గా మారింది.

అలా ఎన్నో సంచలనాలు రేపిన ఈ చిత్రం టెలివిజన్ ప్రీమియర్ కోసం నుంచో చాలా మంది ఎదురు చూసారు. అలా ప్రేక్షకులు కూడా ఈ చిత్రం కోసం ఎదురు చూడగా చాన్నాళ్లకు స్టార్ మా ఛానెల్ ఈ చిత్రం తీసుకొచ్చింది. దీనితో ఈసారి కూడా ఈ చిత్ర యూనిట్ గట్టిగానే ప్రమోట్ చెయ్యగా ఖచ్చితంగా ఆల్ టైం రికార్డు టీఆర్పీ వస్తుంది అని చాలా మంది భావించారు. కానీ ఊహించని విధంగా ఈ చిత్రం కేవలం 11.9 టీఆర్పీ దగ్గరే ఆగిపోవడం షాకిచ్చింది. అయితే ఈ దెబ్బకు కొన్ని గట్టి కారణాలు లేకపోలేవని చెప్పాలి. ఈ సినిమా ఎప్పుడో 2018 లో విడుదలయింది.

తర్వాత 2019 వరకు కూడా ఈ సినిమా హవానే నడిచింది. సో ఇప్పటికి చాలా లేట్ కావడంతో ఇతర మాధ్యమాల్లో ఎన్నో సార్లు చూసేసారు మైనస్ కాగా వీకెండ్ లో టెలికాస్ట్ అంటే ఫ్యామిలీ తో కలిసి చూడాల్సిందే. కానీ ఇప్పటి వరకు చూడని ఫ్యామిలీ ఆడియన్స్ కు ఈ చిత్రం ఏమాత్రం ఎక్కకపోవడంతో వారు కూడా ఈ సినిమాను పక్కన పెట్టేసారు. ఈ రెండు ప్రధాన కారణాల చేత ఈ చిత్రం స్మాల్ స్క్రీన్ పై అనుకున్న స్థాయి అంచనాలను రీచ్ కాలేకపోయింది.

తాజా వార్తలు