పవన్ తో ముచ్చటగా మూడో సారి..!

పవన్ తో ముచ్చటగా మూడో సారి..!

Published on Jul 17, 2020 2:11 AM IST


వకీల్ సాబ్ మూవీలో హీరోయిన్ పై అనేక పుకార్లు నడిచాయి. ఈ లిస్ట్ లో హీరోయిన్ శృతి హాసన్ పేరు ఎక్కువగా వినిపించింది. ఐతే తాను వకీల్ సాబ్ మూవీలో నటించడం లేదని ఆమె చెప్పడంతో అందరూ నిజమే అనుకున్నారు. ఐతే తాజాగా శృతి తను వకీల్ సాబ్ మూవీలో నటిస్తున్నట్లు క్లారిటీ ఇచ్చింది. వకీల్ సాబ్ మూవీలో హీరోయిన్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యం ఉండదు. ఓ సాంగ్ మరియు కేవలం కొన్ని సన్నివేశాలు మాత్రమే ఉంటాయి.

దీనితో శృతి హాసన్ ముచ్చటగా మూడో సారి పవన్ తో జట్టు కట్టినట్లు అవుతుంది. గతంలో వీరిద్దరూ గబ్బర్ సింగ్, కాటమ రాయుడు చిత్రాలతో కలిసి నటించారు. ఇక వకీల్ సాబ్ షూటింగ్ చివరి దశకు చేరింది. కేవలం 20 రోజుల షూట్ మాత్రమే మిగిలి ఉంది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్నారు.

తాజా వార్తలు