దేవరకొండ ఫాలోయింగ్ మైండ్ బ్లోయింగ్..!

దేవరకొండ ఫాలోయింగ్ మైండ్ బ్లోయింగ్..!

Published on Jul 16, 2020 1:23 PM IST

యూత్ లో విజయ్ దేవరకొండ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతి తక్కువ కాలంలో విజయ్ దేవరకొండ యూత్ ఐకాన్ గా ఎదిగారు. కాగా ఈ క్రేజీ హీరో ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య 8 మిలియన్స్ కి చేరింది. అంటే ఏకంగా 80లక్షల మంది ఈ హీరోని ఇంస్టాగ్రామ్ లో ఫాలో అవుతున్నారన్న మాట. దీనితో విజయ్ దేవరకొండ క్రేజ్ ఏమిటో మరోమారు నిరూపితం అయ్యింది.

విజయ్ దేవరకొండ ప్రస్తుతం డైనమిక్ డైరక్టర్ పూరి జగన్నాధ్ తో ఓ చిత్రం చేస్తున్నారు. ఈ మూవీలో ఆయన ప్రొఫెషనల్ ఫైటర్ గా కనిపించనున్నారు. ఇప్పటికే ముంబై మరియు హైదరాబాద్ వేదికగా కొంత షూటింగ్ జరుపుకుంది ఈ చిత్రం. ఈ మూవీతో విజయ్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండగా…అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. ఇక పూరి కనెక్ట్స్ మరియు ధర్మ ప్రొడక్షన్స్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు