కడలి తెలుగు ఆడియో విడుదల తేదీ ఖరారు

కడలి తెలుగు ఆడియో విడుదల తేదీ ఖరారు

Published on Dec 11, 2012 11:45 PM IST


కార్తీక్ కొడుకు గౌతం మరియు రాధా చిన్న కూతురు తులసిని పరిచయం చేస్తూ మణిరత్నం దర్శకత్వంలో వస్తున్న చిత్రం “కడల్”. తెలుగులోకి ఈ చిత్రం “కడలి” పేరుతో అనువదించబడుతుంది. ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు. మణిరత్నం మరియు ఏ ఆర్ రెహమాన్ ల కాంబినేషన్ కి ఉన్న క్రేజ్ ఏంటో అందరికి తెలిసిందే ఈ చిత్ర తమిళ వెర్షన్ ఆడియో విడుదల ఈ నెల 17న జరగనుంది. తెలుగు వెర్షన్ ఆడియో ని డిసెంబర్ 21న విడుదల చెయ్యనున్నారు. “కడలి” చిత్రం జనవరి చివరి వారంలో విడుదలకు సిద్దమయ్యింది ఈ చిత్రానికి వనమాలీ సాహిత్యం అందించారు.

తాజా వార్తలు