లాక్ డౌన్ మూలాన పలు చిత్రాలు స్ట్రైట్ గా డిజిటల్ రిలీజ్ బాట పడుతున్నాయి. మన దేశంలోని అన్ని కీలక భాషల్లోని చిత్రాలు ఇలా డైరెక్ట్ ఓటిటి లోకే రావడానికి సిద్ధం అవుతున్నాయి. అలా ఈరోజు దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో విడుదల కాబడిన చిత్రం “కృష్ణ అండ్ హిస్ లీల”.
రవికాంత్ పేరెపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో “జెర్సీ” చిత్రంతో టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయం అయిన శ్రద్ధ శ్రీనాథ్, సీరత్ కపూర్, షాలినిలు హీరోయిన్లు గా నటించారు..
అయితే ఈ సినిమా హీరో సిద్ధూ జొన్నల గడ్డతో ఈ చిత్ర దర్శకుడు రవికాంత్ కలిసి లిప్ లాక్ పెట్టుకున్న ఫోటో ఒకటి వదిలారు. దీనితో సోషల్ మీడియాలో అది కాస్త వైరల్ అయ్యింది. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణం వహించిన ఈ చిత్రానికి శ్రీ చరణ్ పాకల సంగీతం అందించారు.