వైజాగ్ నుండి తిరిగి వచ్చిన బ్యాక్ బెంచ్ స్టూడెంట్

వైజాగ్ నుండి తిరిగి వచ్చిన బ్యాక్ బెంచ్ స్టూడెంట్

Published on Dec 7, 2012 4:06 AM IST


మధుర శ్రీధర్ రాబోతున్న చిత్రం “బ్యాక్ బెంచ్ స్టూడెంట్” చిత్రం రెండవ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రం గత 18 రోజులుగా విశాఖపట్నంలో పలు ప్రాంతాలలో చిత్రీకరణ జరుపుకుంది. ఈ చిత్రాన్ని తెలుగు మరియు తమిళంలో ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. మహాత్ రాఘవేంద్ర కథానాయకుడిగా చేస్తున్న ఈ చిత్రంలో పియా బాజ్పాయి మరియు అర్చన కవి ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. బీచ్ కేఫ్ సెట్లో ప్రీ క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరించారు. “వాడి బ్రేక్ అప్ లవ్ స్టొరీ” అనే శీర్షికతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్నారు. పి జి విందా సినిమాటోగ్రఫీ అందిస్తుండగా షిరిడి సాయి కంబైన్స్ బ్యానర్ మీద ఎంవీకే రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్ర తరువాత షెడ్యూల్ త్వరలో మొదలు కానుంది. ఇదిలా ఉండగా పియా బాజ్పాయి ప్రస్తుతం “దళం” మరియు “సతతం ఒరు ఇరుత్తరై” అన్న చిత్రాల విడుదలకై వేచి చూస్తున్నారు.

తాజా వార్తలు