శర్వానంద్ కి ఇదే మొదటిసారి

శర్వానంద్ కి ఇదే మొదటిసారి

Published on Dec 7, 2012 2:58 AM IST

రెగ్యులర్ సినిమాలు కాకుండా విభిన్నమైన సినిమాలు ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. శర్వానంద్, శ్రీహరి, ప్రియ ఆనంద్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ‘కో అంటే కోటి’ విడుదలకు సిద్ధమైంది. శర్వానంద్ మొదటిసారి యాక్షన్, పూర్తి కమర్షియల్ సినిమాలో నటిస్తున్నాడు. శర్వా ఆర్ట్స్ బ్యానర్ పై మైనేని వసుంధర దేవి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. శక్తికాంత్ కార్తీక్ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో ఈ నెల 8న ప్రముఖుల మధ్య భారీగా విడుదల చేయబోతున్నారు. అవకాయ్ బిర్యాని చిత్రాన్ని తెరకెక్కించిన అనీష్ కురివిల్లా ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమాలో శ్రీహరి పాత్ర చాలా కీలకం. సినిమాని కూడా అతి త్వరలోనే విడుదల చేయనున్నట్లు సమాచారం.

తాజా వార్తలు