మల్టీ స్టారర్ చిత్రాలు చెయ్యడానికి నేను ఎప్పుడు సిద్దమే – వెంకటేష్

మల్టీ స్టారర్ చిత్రాలు చెయ్యడానికి నేను ఎప్పుడు సిద్దమే – వెంకటేష్

Published on Dec 6, 2012 11:26 PM IST

“సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” చిత్రం రూపుదిద్దుకుంటున్న విధానం పట్ల వెంకటేష్ పూర్తి సంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ మల్టీ స్టారర్ చిత్రంలో మహేష్ బాబు మరియు వెంకటేష్ అన్నదమ్ముల పాత్రలలో కనిపించనున్నారు. ఈ చిత్ర దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలని వెంకటేష్ ప్రశంసలలో ముంచెత్తారు. తెలుగు పరిశ్రమలో మల్టీ స్టారర్ చిత్రాల గురించి మాట్లాడుతూ “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్ర విజయం తరువాత తెలుగులో మరిన్ని మల్టీ స్టారర్ చిత్రాలు రానున్నాయి. మరిన్ని మల్టీ స్టారర్ చిత్రాలలో నటించడానికి నేను ఎప్పుడు సిద్దమే” అని అన్నారు. ఇదిలా ఉండగా వెంకటేష్ ప్రస్తుతం “షాడో” చివరి దశ చిత్రీకరణలో పాల్గొంటున్నారు ఈ చిత్రంలో క్లైమాక్స్ మరియు ఒక పాట మినహా చిత్రీకరణ మొత్తం పూర్తయ్యింది. మెహెర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తాప్సీ కథానాయికగా కనిపించనుంది. చాలా కాలం తరువాత వెంకటేష్ చేస్తున్న యాక్షన్ చిత్రం ఇది.

తాజా వార్తలు