బాలయ్య బాబు – బి.గోపాల్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా స్క్రిప్ట్ పనులు ఇప్పటికే పూర్తి అయ్యాయని జూన్ 10న బాలయ్య పుట్టినరోజు స్పెషల్ గా ఈ ప్రాజెక్ట్ ను అధికారికంగా ప్రకటించబోతున్నారని మీడియాలో అనేక రూమర్స్ వస్తున్నాయి. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా క్యాన్సల్ అయినట్టు తెలుస్తోంది, ‘బాలయ్య – గోపాల్’లది సూపర్ హిట్ కాంబినేషన్ కావడంతో ఈ సినిమా కోసం బాలయ్య ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రమంలో ఈ వార్త బాలయ్య ఫ్యాన్స్ కు నిరాశ కలిగించే అంశం.
ఇక ప్రస్తుతం బాలయ్య, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో యాక్షన్ తో పాటు ఎమోషన్ కూడా బాగుంటుందట. పైగా బాలయ్య బాబు రెండు పాత్రల్లో కనిపిస్తుండటం, వాటిలో ఒకటి అఘోరా పాత్ర కావడం, ఆ పాత్ర కోసం బాలయ్య గుండు చేయించుకోవడంతో అభిమానుల్లో ఆసక్తి ఎక్కువవుతోంది. ఈ సినిమాని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.