పవన్ – క్రిష్ సినిమా జూలై నుండి ?

పవన్ – క్రిష్ సినిమా జూలై నుండి ?

Published on May 23, 2020 6:58 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కరోనా విషయంలో తెలుగు ప్రజానీకాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూనే ఉన్నారు. ఇక పవర్ స్టార్ ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ సినిమాలనూ ఒప్పుకుంటన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వేణు శ్రీరామ్ మరియు క్రిష్ లతో సినిమాలు చేస్తున్నారు. కాగా క్రిష్ సినిమా కోసం పవన్ కళ్యాణ్ జూలై సెకెండ్ వీక్ నుండి షూట్ రెడీ కాబోతున్నట్లు తెలుస్తోంది. రామోజీ ఫిల్మ్ సిటీలో సెట్ వేసి షూట్ చేయనున్నారు.

ఇక క్రిష్ తో చేస్తోన్న ఈ సినిమా ఒక పిరియాడికల్ బ్యాక్ డ్రాప్లో నడిచే చిత్రమని, ఇందులో పవన్ రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపిస్తారనే వార్తలు వచ్చాయి. అన్నట్టు ఈ చిత్రానికి ‘విరూపాక్ష’ అనే పేరును అనుకుంటున్నారు. అయితే చిత్ర బృందం నుండి మాత్రం ఇంకా ఎలాంటి అప్డేట్ వెలువడలేదు. ప్రముఖ నిర్మాత ఏ ఎమ్ రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు