పార్లమెంట్లో ఎన్.టి.ఆర్ విగ్రహం.!

పార్లమెంట్లో ఎన్.టి.ఆర్ విగ్రహం.!

Published on Dec 5, 2012 5:44 PM IST


లెజెండ్రీ తెలుగు సినిమా నటుడు మరియు ఆంధ్రప్రదేశ్ ప్రజలచేత అన్నా అని పిలిపించుకున్న మాజీ ముఖ్య మంత్రి డా. నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని ఎట్టకేలకు న్యూ ఢిల్లీ లోని పార్లమెంట్ కాంప్లెక్స్ లో ప్రతిష్టించనున్నారు. స్పీకర్ విగ్రహం పెట్టడానికి అనుమతించారు, అలాగే ఎన్.టి.ఆర్ కుమార్తె మరియు యూనియన్ మినిస్టర్ దగ్గుబాటి పురంధరేశ్వరికి ఎలాంటి విగ్రహం పెట్టాలో చూసుకోమని చెప్పారు.

తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఐకాన్ మరియు మాజీ సి.ఎం అయిన ఎన్.టి.ఆర్ విగ్రహాన్ని పార్లమెంట్ లో పెట్టాలని చాలా రోజుల నుంచి పెండింగ్ ఉంది, దానికి ఈ రోజుటితో శుభం కార్డ్ వేసారు. విగ్రహం ఎలాంటిది, ఎప్పుడు ఆవిష్కరించనున్నారు అనే విషయాలు త్వరలోనే తెలియజేసే అవకాశం ఉంది.

తాజా వార్తలు