యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రానున్న ‘మిర్చి’ సినిమా ప్రొడక్షన్ ప్రస్తుతం చివరిదశలో ఉంది. ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ 11 తో ముగియనుందని ఈ చిత్ర నిర్మాత మాకు తెలిపారు. రేపటి నుంచి ఓ పాటని చిత్రీకరించనున్నారు మరియు అది పూర్తి కాగానే మిగిలి ఉన్న పాచ్ వర్క్ సీన్స్ ని షూట్ చేయనున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన అనుష్క – రిచా గంగోపాధ్యాయ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి యంగ్ తరంగ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాని ప్రమోద్ ఉప్పలపాటి మరియు వంశీ కృష్ణా రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్లకి మరియు ప్రభాస్ కాస్ట్యూమ్స్ సూపర్బ్ గా ఉండడంతో ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి.