యంగ్ హీరోయిన్ సయేశా టాలీవుడ్ ద్వారా వెండితెరకు పరిచయం అయ్యింది. అక్కినేని అఖిల్ డెబ్యూ మూవీగా వచ్చిన అఖిల్ సినిమాలో ఈమె నటించింది. ఆ సినిమా ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో ఈమెకు తెలుగులో అంతగా అవకాశాలు రాలేదు. కెరీర్ బిగినింగ్ లోనే తమిళ్ హీరో ఆర్యను ఈమె ప్రేమ వివాహం చేసుకుంది. సయేశా వయసు కేవలం 22 కాగా ఆర్య వయసు 39 ఏళ్ళు. ఇక వివాహం తరువాత ఈమె సినిమాలలో నటించడం కొంచెం తగ్గించారు. ఆమె నటిస్తున్న రెండు చిత్రాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి.
కాగా మంచి డాన్సర్ అయిన సయేశా తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో ఓ డాన్స్ వీడియో పోస్ట్ చేశారు. సయేశా గ్రేసింగ్ స్టెప్స్ తో వీడియోలో హీటు పుట్టించగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఆ డాన్స్ వీడియోకు మనస్ఫూర్తిగా డాన్స్ చేయాలని ఓ కోట్ రాసింది. సూర్య హీరోగా వచ్చిన బందోబస్త్ సినిమాలో సయేశా హీరోయిన్ గా నటించారు.
https://www.instagram.com/p/B_9WApyDZu7/