ఎన్టీఆర్ ఫ్యాన్స్ రికార్డ్స్ బద్దలు కొట్టడం ఖాయం

ఎన్టీఆర్ ఫ్యాన్స్ రికార్డ్స్ బద్దలు కొట్టడం ఖాయం

Published on May 9, 2020 2:02 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మే నెల ఎంతో ప్రత్యేకం. ఎన్టీఆర్ పుట్టిన రోజు మే 20 కావడమే దానికి కారణం. ఇక ఆ రోజు ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా రచ్చ చేయనున్నారు. ఆయన బర్త్ డే విషెష్ యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో భారీ ఎత్తున ట్రెండ్ చేయనున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ ఫ్యాన్స్ దీనిపై పర్ఫెక్ట్ ప్లాన్ తో ఉన్నారట. అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే విషెస్ తోనే వీరు రికార్డు నెలకొల్పారు. ఎన్టీఆర్ బర్త్ డే ఫెస్ట్ బిగిన్స్ అనే యాష్ ట్యాగ్ తో వీరు చేసిన ట్వీట్స్ మిలియన్స్ లో ఉన్నాయి.

మరి అడ్వాన్స్ బర్త్ డే విషెస్ తోనే ఇన్ని రికార్డ్స్ నెలకొల్పిన వీరు బర్త్ డే రోజు సోషల్ మీడియాలో వీరి రచ్చ మాములుగా ఉందని అర్థం అవుతుంది. ఇక అదే రోజు ఆర్ ఆర్ ఆర్ నుండి ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియో విడుదల కానుంది. కొమరం భీమ్ గా ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియో కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన అల్లూరిగా చరణ్ వీడియో సూపర్ రెస్పాన్స్ అందుకోవడంతో ఈ వీడియో పైన కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు