గత ఏడాది ఇస్మార్ట్ శంకర్ గా వెండితెరపై దుమ్ము రేపాడు హీరో రామ్. దర్శకుడు పూరి జగన్నాధ్ తెరకెక్కించిన ఆ సినిమా రామ్ కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ రాబట్టింది. దాదాపు 75 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టి నిర్మాతలు ఛార్మి, పూరి లకు భారీ లాభాలు తెచ్చిపెట్టింది. రామ్ తన తదుపరి చిత్రంగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో రెడ్ మూవీ చేస్తున్నారు. ఈ మూవీ నుండి ‘నువ్వే నువ్వే’ అనే సాంగ్ మేకింగ్ వీడియోని రేపు సాయంత్రం 5:15 నిమిషాలకు విడుదల చేస్తారట. ఈ మేరకు చిత్ర బృందం ఓ పోస్టర్ విడుదల చేశారు.
చైర్ లో ఉన్న రామ్ ఒడిలో హీరోయిన్ మాళవిక శర్మ కూర్చున్న రొమాంటిక్ పోజ్ బాగుంది. ఈ సినిమాలో మరో హీరోయిన్ గా నివేదా పేతురాజ్ నటిస్తుండగా హెబ్బా పటేల్ గెస్ట్ రోల్ చేస్తుంది. తమిళ హిట్ మూవీ తాడం కి రీమేక్ గా వస్తున్న ఈ చిత్రంలో రామ్ మొదటిసారి డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీకి సంగీతం మణిశర్మ అందిస్తున్నారు.