కమర్షియల్ సినిమా ఎలా తీయాలో ఇప్పుడు తెలిసింది

కమర్షియల్ సినిమా ఎలా తీయాలో ఇప్పుడు తెలిసింది

Published on Dec 5, 2012 1:19 AM IST

విమర్శకులు మెచ్చే దర్శకుడు క్రిష్ మొదటి రెండు సినిమాలు కమర్షియల్ అంశాలకు దూరంగా ఉంటూ గమ్యం, వేదం సినిమాలు తీసాడు. అవి రెండు కమర్షియల్ గా భారీ సక్సెస్ కాలేకపోయాయి. మూడవ సినిమా రానాతో కమర్షియల్ అంశాలు జోడించి తీసిన కృష్ణం వందే జగద్గురుం గత వారం విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ రోజు సక్సెస్ మీట్లో క్రిష్ మాట్లాడుతూ ఒక సినిమా జనాలకి నచ్చాలంటే కార్ బ్లాస్టింగ్స్, కార్ చేసింగ్స్, ఐటం సాంగ్ ఇవన్నీ ఉండాలని నాకు మూడవ సినిమాకి తెలిసింది. కమర్షియల్ అంశాలు సరిగ్గా జోడిస్తే సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని ఈ సినిమా ద్వారా నాకు తెలిసింది. కృష్ణం వందే జగద్గురుం కలెక్షన్స్ పట్ల క్రిష్ చాలా సంతోషంగా ఉన్నాడు. నెక్స్ట్ సినిమాలు కూడా ఇలాగే తీస్తాడోమో చూడాలి మరి.

తాజా వార్తలు