దశాబ్దాలుగా స్టార్ ప్రొడ్యూసర్ గా అనేక బ్లాక్ బస్టర్ సినిమాలు అశ్వినీ దత్ తీశారు. ఆయన నిర్మాణంలో చిరంజీవి, కె రాఘవేంద్ర రావు కాంబినేషన్ లో వచ్చిన జగదేకవీరుడు అతిలోకసుందరి టాలీవుడ్ లో ఓ మైలురాయి లాంటి చిత్రం. 1990 మే 9న విడుదలైన ఆ సినిమా 30ఏళ్ళు పూర్తి చేసుకోనుంది. ఈ సంధర్భంగా అశ్వినీ దత్ ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సంధర్భంగా అనేక విషయాలు పంచుకున్న అశ్విని దత్… ప్రభాస్ తో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి కూడా చెప్పారు.
మహానటి సినిమా తరువాత నాగ్ అశ్విన్ ఎటువంటి కథ చెవుతాడు అనుకుంటున్న తరుణంలో ఓ భారీ యూనివర్సల్ స్టోరీ చెప్పారట నాగ్ అశ్విన్. వందల కోట్ల బడ్జెట్ అవసరమయ్యే ఈ సినిమాకు ప్రభాస్ కరెక్ట్ అని నాగ్ అశ్విన్ ఆయనకి సూచించారట. ఇక కథ విన్న ప్రభాస్ వెంటనే ఓకె చెప్పారట. ఓ అద్భుతమైన కథతో ఈ చిత్రం తెరకెక్కుతుందన్న ఆయన 2020 అక్టోబర్ లో మొదలుపెట్టి 2022 ఏప్రిల్ లో విడుదల చేయాలని భావిస్తున్నారట.