గతంలో ఎన్నడూ లేని విధంగా ఇద్దరు ప్రధాన సంగీత దర్శకులు 2013లో చాలా గట్టిగా పోటీ పడనున్నారు. అదేనండి దేవిశ్రీ ప్రసాద్ మరియు ఎస్ ఎస్ తమన్ గురించి మాట్లాడుతున్నాం. పరిశ్రమలో ఇళయరాజా,మణిశర్మ ,ఎం ఎం కీరవాణి వంటి అగ్ర సంగీత దర్శకులు అందరు ఎంపిక చేసుకున్న చిత్రాలే చేస్తుండటంతో 2013లో రానున్న ప్రతి భారీ బడ్జెట్ చిత్రానికి అయితే దేవిశ్రీ ప్రసాద్ లేకపోతే ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. 2012లో తమన్ మూడు చిత్రాలు మాత్రమే చెయ్యగా అందులో “బిజినెస్ మాన్” మరియు “లవ్ ఫెయిల్యూర్” చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద పరవలేధనిపించాయి. దేవిశ్రీ ప్రసాద్ ఈ ఏడాది అద్భుతంగా కలిసి వచ్చింది “గబ్బర్ సింగ్”, “జులాయి” మరియు “డమరుకం” చిత్రాలతో అయన మంచి విజయాలను అందుకున్నారు. డిసెంబర్ 21న “సారోచ్చారు” చిత్రంతో దేవిశ్రీ మరోసారి ప్రేక్షకుల ముందుకి రానున్నారు. ఈ ఇద్దరు సంగీత దర్శకులు 2013 లో భారీ పోటీ పడనున్నారు. వీరు చేస్తున్న చిత్రాల లిస్టు ఇలా ఉన్నాయి
తమన్ | – | దేవి శ్రీ ప్రసాద్ |
బాద్షా (ఎన్టీఆర్,కాజల్) | – | మహేష్ బాబు -సుకుమార్ చిత్రం (మహేష్ బాబు, కృతి సనోన్) |
నాయక్ (రామ్ చరణ్ ,కాజల్,అమలపాల్) | – | పవన్ కళ్యాణ్ -త్రివిక్రమ్ చిత్రం (పవన్ కళ్యాణ్, సమంత) |
బలుపు (రవితేజ,శృతి హాసన్) | – | ఎవడు (రామ్ చరణ్, అల్లు అర్జున్ , ఏమి జాక్సన్ ,కాజల్) |
గౌరవం (అల్లు శిరీష్,యామి గౌతం) | – | జంజీర్ (రామ్ చరణ్, ప్రియాంక చోప్రా) |
జబరదస్త్ (సిద్దార్థ్,సమంత) | – | ఇద్దరమ్మాయిలతో (అల్లు అర్జున్, అమలా పాల్, కేథరిన్ తెరెసా) |
లవ్ స్టొరీ (నాగార్జున,నయనతార) | – | మిర్చి(ప్రభాస్,అనుష్క,రిచా గంగోపాధ్యాయ్) |
షాడో (వెంకటేష్,తాప్సీ) | – | భాయ్ (నాగార్జున,రిచా గంగోపాధ్యాయ్) |
వాలు (శింభు, హన్సిక) – | – | అలెక్స్ పాండియన్/ బాడ్ బాయ్ (కార్తి,అనుష్క) |
సెట్టై / నాటీ బాయ్స్ (కార్తి,కాజల్) – | – | సింగం 2/యముడు 2 (సూర్య,అనుష్క,హన్సిక) |
— – | – | అజిత్ – శివ చిత్రం (అజిత్,తమన్నా) |