సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ ఓ అరుదైన రికార్డు అందుకున్నారు. ఆయన ఇంస్టాగ్రామ్ ఫాలోయర్స్ ని 7 మిలియన్స్ కి పెంచుకొని ఆ రికార్డు అందుకున్న మొదటి సౌత్ ఇండియన్ స్టార్ గా రికార్డులకు ఎక్కాడు. సౌత్ ఇండియా మొత్తంలో 7 మిలియన్ ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్న ఏకైక హీరో విజయ్ దేవరకొండ. అది కూడా తను ఇంస్టాగ్రామ్ లోకి ఎంటరైన రెండేళ్లలో చేరుకోవడం మరో విశేషం.
ఇక విజయ్ దేవరకొండ ప్రస్తుతం దర్శకుడు పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో ఓ స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో విజయ్ ప్రొఫెషనల్ ఫైటర్ గా కనిపించనున్నాడు. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుండగా, పూరి కనెక్ట్స్ మరియు ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పాన్ ఇండియా చిత్రంగా విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం మణిశర్మ అందిస్తున్నారు.