లాక్ డౌన్ లో మద్యం అమ్మకాలపై మండిపడ్డ స్టార్ హీరో

లాక్ డౌన్ లో మద్యం అమ్మకాలపై మండిపడ్డ స్టార్ హీరో

Published on May 6, 2020 2:05 AM IST

స్టార్ హీరో కమల్ హాసన్ లాక్ డౌన్ సమయంలో మద్యం అమ్మకాలు జరపడాన్ని తప్పుబట్టారు. ప్రజల ఆరోగ్యంపై బాధ్యత లేకుండా మద్యం షాపు తెరవడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. దీని వలన దారుణ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని ఆయన చెప్పారు. కరోనా వైరస్ తమిళనాడు లో అంచనాలకు మించి విజృభిస్తుంది. ఇలాంటి పరిస్థితులలో మద్యం షాపులు తెరిచి మరింత ప్రమాదకర పరిస్థితులను ఏర్పర్చడం అవుతుందని ఆయన మండిపడ్డారు.

ఇక ప్రస్తుతం కమల్ హాసన్ దర్శకుడు శంకర్ డైరెక్షన్ లో భారతీయుడు 2 చేస్తున్నారు. దాదాపు ఈ చిత్ర షూటింగ్ పూర్తి కాగా లాక్ డౌన్ అనంతరం విడుదల కానుంది. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, సిద్దార్ధ్ ఓ కీలక రోల్ చేస్తున్నాడు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు