తమిళ్లో కూడా హవా చూపుతున్న మహేష్ బాబు

తమిళ్లో కూడా హవా చూపుతున్న మహేష్ బాబు

Published on Dec 4, 2012 9:28 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో ‘బిజినెస్ మాన్’ సినిమా 2012 సంక్రాంతి కానుకగా విడుదలై సూపర్ హిట్ కావడమే కాకుండా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ కొల్లగొట్టింది. అప్పట్లో ఈ సినిమాని తెలుగులో భారీగా విడుదల చేసారు. ఈ సినిమా ఈ శుక్రవారం అనగా డిసెంబర్ 7న తమిళంలోకి డబ్ చేసి విడుదల చేస్తున్నారు. తెలుగులోలానే తమిళ్లో కూడా ఈ సినిమాని భారీగా సుమారు 200 థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఒక డబ్బింగ్ తెలుగు సినిమా ఇంత భారీగా రిలీజ్ కావడం ఇదే తొలిసారి చెప్పుకోదగ్గ విశేషం. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి ఎస్.ఎస్ తమన్ సంగీతం అందించారు. ఈ సినిమాకి మహేష్ బాబు నటనే ప్రధాన హైలైట్. తెలుగులో ఘన విజయం సాదించిన ఈ సినిమా తమిళంలో ఎంతటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

తాజా వార్తలు