మహేష్ మేకోవర్ మాములుగా ఉండదట

మహేష్ మేకోవర్ మాములుగా ఉండదట

Published on May 5, 2020 10:33 AM IST

సరిలేరు నీకెవ్వరు మూవీతో సంక్రాంతి బ్లాక్ బస్టర్ అందుకున్న మహేష్ తన నెక్స్ట్ మూవీ ఇంకా ప్రకటించలేదు. ఐతే గీత గోవిందం దర్శకుడు పరుశురాంతో ఆయన మూవీ దాదాపు ఖరారైంది. పరుశురామ్ కూడా తన నెక్స్ట్ మూవీ మహేష్ తో అని క్లారిటీ ఇచ్చారు. ఇక అధికారిక ప్రకటనే మిగిలిగి ఉంది. ఇక ఈ చిత్రంలో మహేష్ పూర్తిగా ఓ డిఫరెంట్ లుక్ లో కనిపిస్తారని సమాచారం. పురుశురాం ఇప్పటికే ఈ చిత్రంలో మహేష్ పాత్రకు సరిపోయేలా ఓ డిఫరెంట్ లుక్ డిజైన్ చేసి వుంచారట.

కొన్నాళ్లుగా మహేష్ లుక్ లో మొనాటమీ వచ్చిందనే విమర్శలు ఎక్కువయ్యాయి. ఆయన అన్ని సినిమాలో ఒకే లుక్ లో కనిపిస్తున్నాడని కొందరు అంటున్నారు. ఈ విమర్శలకు చెక్ పెట్టేలా మహేష్ ఓ భిన్నమైన లుక్ ట్రై చేస్తారని తెలుస్తుంది. ప్రస్తుతం ఇంటిలోనే ఉంటున్న మహేష్ కొంచెం జుట్టు మరియు గెడ్డం పెంచారు. మరి ఆయన పరుశురామ్ మూవీ కోసమే అలా జుట్టు పెంచుతున్నారేమో. ఈ మూవీపై అధికారిక ప్రకటన ఈనెల 31న వెలువడనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు