విడుదలైన శ్రీకాంత్ శత్రువు ఆడియో

విడుదలైన శ్రీకాంత్ శత్రువు ఆడియో

Published on Dec 4, 2012 10:58 AM IST


ఫ్యామిలీ హీరో శ్రీ కాంత్ మరియు అక్ష హీరో హీరోయిన్లుగా మనముందుకు రానున్న చిత్రం ‘శత్రువు’. ఎస్.ఎస్ ఆర్ ప్రసాద్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి వి.ఎన్ రామి రెడ్డి నిర్మాత. ఈ చిత్ర ఆడియో వేడుక నిన్న రాత్రి హైదరాబాద్లో జరిగింది. ఈ వేడుకకి ముఖ్య అతిధిగా హాజరైన మంత్రి ఘంటా శ్రీనివాస రావు సిడిలను విడుదల చేసి మొదటి సిడిని మైసూర్ రెడ్డికి అందించారు.

‘గతంలో వెంకటేష్ గారు హీరోగా వచ్చిన ‘శత్రువు’ మంచి విజయాన్ని అందుకుంది. ఈ టైటిల్ మా కథకి దగ్గరగా ఉండడంతో ఈ టైటిల్ ని ఎంచుకున్నాము. ఇంకా ఒక్క సీన్ మినహా మిగతా చిత్రీకరణ పూర్తయ్యింది. ఈ సినిమాలో నా పాత్ర కంటే అక్ష పాత్రకి ప్రాముఖ్యత ఉంటుందని’ శ్రీ కాంత్ అన్నాడు. గణ ఈ సినిమాకి సంగీతం అందించాడు.

నిర్మాత రామి రెడ్డి మాట్లాడుతూ ‘ గణ చాలా మంచి ట్యూన్స్ ఇచ్చారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా దర్శకుడు అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి చేసాడు. అలాగే డైరెక్టర్ గా సినిమాని చాలా బాగా తీసారని’ అన్నాడు. 2013 లో ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

తాజా వార్తలు