ఎన్టీఆర్ హీరోగా జక్కన్న రామాయణం చేయాలట..!

ఎన్టీఆర్ హీరోగా జక్కన్న రామాయణం చేయాలట..!

Published on May 3, 2020 10:12 PM IST

దర్శక ధీరుడు రాజమౌళి తను ఏ సినిమా తీసినా దానికి వందకి వంద శాతం న్యాయం చేస్తారు. ఆయన ప్రస్తుతం తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ పై కూడా దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొని ఉంది. ఎన్టీఆర్ ని కొమరం భీమ్ గా, రామ్ చరణ్ ని అల్లూరి సీతారామ రాజుగా ఆయన ఈ చిత్రంలో చూపించనున్నాడు. ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ 80 శాతం వరకు పూర్తయింది. లాక్ డౌన్ అనంతరం ఈ మూవీ నెక్స్ట్ షెడ్యూల్ మొదలు కానుండగా వచ్చే ఏడాది జనవరి 8న సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు.

ఐతే ట్విట్టర్ వేదికగా నెటిజెన్స్ రాజమౌళికి ఓ సీరియస్ రిక్వెస్ట్ పంపించారు. ఆయనను భారత దేశ పౌరాణిక గాథగా ఉన్న రామాయణం తెరకెక్కించమని అడుగుతున్నారు. రాజమౌళి మేక్ రామాయణ పేరుతో ఓ యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ రామునిగా రాజమౌళి రామాయణం చేయాలని వారు కోరుకుంటున్నారు. మహాభారతం తన డ్రీం ప్రాజెక్ట్ అని రాజమౌళి చెవుతుండగా ఆయన అభిమానులు మాత్రం రామాయణం తెరకెక్కించాలని కోరుకుంటున్నారు. 1987లో డి డి లో ప్రసారం అయిన రామానంద్ సాగర్ రామాయణం పునఃప్రసారం అవుతుండగా వరల్డ్ రికార్డ్ వ్యూస్ దక్కించుకుంటుంది. ఈ నేపథ్యంలో రామాయణ డిమాండ్ తెరపైకి వచ్చింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు