మెగా డాటర్ నిహారిక కొణిదెల హీరోయిన్ గా నిలదొక్కుకోవడం కోసం గట్టి ప్రయత్నాలే చేస్తుంది. ఆమె తమిళ్ లో కూడా అవకాశాలు అందుకుంటూ ముందుకు వెళుతుంది. కాగా ఓ మై కడువలె సినిమాతో మంచి సక్సెస్ అందుకోవడంతో పాటు వరుస అవకాశాలతో దూసుకెళుతున్న తమిళ యంగ్ హీరో అశోక్ సెల్వన్ తో ఆమె నటించనుంది. ఈ విషయాన్ని ఇంస్టాగ్రామ్ వేదికగా స్పష్టత ఇచ్చారు నిహారిక కొణిదెల. ఆమె తమిళంలో ఓ మూవీ చేయనున్నారని వార్తలు వస్తుండగా అది అశోక్ సెల్వన్ మూవీ అని స్పష్టం అయ్యింది.
నిహారికి ఒక మనసు అనే ట్రాజిక్ ఎమోషనల్ లవ్ స్టోరీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత ఆమె చేసిన రెండు మూడు చిత్రాలు అనుకున్నంత విజయం సాధించలేదు. గత ఏడాది సైరా చిత్రంలో చిన్న పాత్రలో మెరిసిన ఈమె, ఆచార్యలో ఓ కీలక రోల్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
https://www.instagram.com/p/B_t49JVJthJ/?igshid=1u0zgsm3odfqv