మహేష్ బాబు సినిమాలో సోనాక్షి సిన్హా?

మహేష్ బాబు సినిమాలో సోనాక్షి సిన్హా?

Published on Dec 4, 2012 1:08 PM IST


సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, విభిన్న చిత్రాల దర్శకుడు క్రిష్ డైరెక్షన్లో తెరకెక్కనున్న సినిమాలో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హాని హీరోయిన్ గా తీసుకోనున్నారనే వార్త ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. అధికారికంగా ఈ వార్తని ఇంకా తెలియజేయలేదు కానీ సోనాక్షి తో చర్చలు చివరిదశలో ఉన్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. మహేష్ బాబు మరియు క్రిష్ సినిమాకి ‘శివం’ అనేది వర్కింగ్ టైటిల్. ఈ సినిమా 2013 సమ్మర్లో సెట్స్ పైకి వెళ్లనుంది.

క్రిష్ తీసిన ‘కృష్ణం వందే జగద్గురుమ్’ సినిమా ఇటీవలే విడుదలై మంచి పాజిటివ్ రెస్పాన్స్ మరియు విమర్శకుల ప్రశంశలు అందుకుంది. ప్రస్తుతం క్రిష్ మహేష్ సినిమా స్క్రిప్ట్ కి తుది మెరుగులు దిద్దే పనిలో ఉన్నాడు. ఇది ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తిని పెంచే కాంబినేషన్.

తాజా వార్తలు