ఆయన మరణం కలచి వేసింది- చరణ్

ఆయన మరణం కలచి వేసింది- చరణ్

Published on Apr 30, 2020 4:11 PM IST

రిషి కపూర్ మరణం దేశవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులను, సినీ ప్రముఖులను విషాదంలోకి నెట్టింది. ఆయన అకాల మరణం అందరినీ కలచివేస్తుంది. క్యాన్సర్ తో కొన్నాళ్లుగా యుద్ధం చేస్తున్న రిషి కపూర్ మెరుగైన వైద్యం కోసం అమెరికాలో కొన్నాళ్లు గడిపారు. నేడు ఉదయం ఆయన ఆసుపత్రిలో తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు, వైద్యులు ధ్రువీకరించడం జరిగింది.

కాగా హీరో రామ్ చరణ్ రిషి కపూర్ మరణానికి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. భారత చలన చిత్ర పరిశ్రమలో ధ్రువ తారగా వెలిగిన మరో నటుడు మనలను వదిలి వెళ్లిపోయారని విచారం వ్యక్తం చేశారు. ఇండియన్ సినిమాకు అయన మరణం పూడ్చలేని లోటు అన్న రామ్ చరణ్ వారికి కుటుంబానికి సంతాపం ప్రకటించారు. వారికి భగవంతుడు మనో ధైర్యం ఇవ్వాలని కాంక్షించారు.

తాజా వార్తలు