కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర టాలీవుడ్ కి కూడా సుపరిచితుడే రెండు దశాబ్దాల కింద ఆయన చిత్రాలు తెలుగులో సంచలన విజయాలు నమోదు చేశాయి. సొసైటీ లో ఉండే కుళ్ళును తన మార్కు సెటైర్స్ తో తెరకెక్కించడం ఉపేంద్ర ప్రత్యేకత. ఇక గత ఏడాది ఆయన ఐ లవ్ యూ అనే చిత్రం విడుదల చేశారు. ఇక త్వరలో ఆయన నటించిన కబ్జా మూవీ విడుదల కానుంది. ఈ చిత్ర ఫస్ట్ లుక్ ఇటీవల విడుదల కాగా మంచి ఆదరణ దక్కించుకుంది.
2015లో సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో నెగెటివ్ షేడ్స్ కలిగిన ప్రాధాన్యం ఉన్న రోల్ చేశారు. ఆ సినిమా తరువాత ఉపేంద్ర మళ్ళీ తెలుగు సినిమా చేయలేదు. ఇదే విషయాన్ని ఆయన్ని అడుగగా పాలిటిక్స్ మరియు కన్నడ చిత్రాలతో బిజీగా ఉండడం వలన తెలుగులో చేయలేకపోయాను అన్నారు. అలాగే ఆయనను అందరూ విలన్ రోల్స్ చేయమని అడుగుతున్నారట. అందుకే ఆయనకు ఏమి చేయాలో అర్థం కాని డైలమాలో ఉన్నారట.