జనవరిలో మొదలుకానున్న నారా రోహిత్ – తాతినేని సత్యల చిత్రం

జనవరిలో మొదలుకానున్న నారా రోహిత్ – తాతినేని సత్యల చిత్రం

Published on Dec 3, 2012 9:34 PM IST


గతంలో “భీమిలి కబడ్డీ జట్టు” మరియు “ఎస్.ఎం.ఎస్” వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన తాతినేని సత్య దర్శకత్వంలో నారా రోహిత్ నటించనున్నాడని గతంలోనే మేము చెప్పాము. ఈ చిత్రం యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కనుంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం 2013 జనవరి మధ్యలో మొదలు కానుంది. నారా రోహిత్ తన తరువాత చిత్రం “మద్రాసి” చిత్రీకరణ పూర్తి చేసుకున్నాక ఈ చిత్ర చిత్రీకరణలో పాల్గొననున్నారు. ఇదిలా ఉండగా ఈ చిత్రంలో “ఎస్.ఎం.ఎస్” మరియు “రొటీన్ లవ్ స్టొరీ” ఫేం రెజిన కథానాయికగా నటించనుంది. ఈ చిత్ర బృందం గురించి అధికారిక ప్రకటన త్వరలో చెయ్యనున్నారు. RVCH ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా కే ఎస్ రామారావు సమర్పిస్తున్నారు.

నారా రోహిత్ త్వరలో “ఒక్కడినే” చిత్రంతో ప్రేక్షకుల ముందుకి రానున్నారు. ఈ చిత్రం గతంలో డిసెంబర్ 7న విడుదల అవ్వాల్సి ఉండగా ప్రస్తుతం ఈ చిత్రాన్ని డిసెంబర్ 14 కి వాయిదా వేశారు. ఈ చిత్రానికి శ్రీనివాస రాగ దర్శకత్వం వహించగా నిత్యమీనన్ ప్రధాన పాత్ర పోషించింది. “ఒక్కడినే”, “మద్రాసి” చిత్రాలు కాకుండా రవితేజ ప్రధాన పాత్రలో వస్తున్న “సారోచ్చారు” చిత్రంలో కూడా నార రోహిత్ కనిపించనున్నారు.

తాజా వార్తలు