మారుతీ స్టోరీ లైన్ బన్నీకి కూడా సరిపోతుందట

మారుతీ స్టోరీ లైన్ బన్నీకి కూడా సరిపోతుందట

Published on Apr 26, 2020 2:00 AM IST

మనుషులలో ఉండే లోపాలను కథలో మెయిన్ పాయింట్ గా తీసుకొని, దాని చుట్టూ కామెడీ, ఎమోషన్స్ అల్లి చక్కని సినిమా తీస్తారు దర్శకుడు మారుతి. భలే భలే మగాడివోయ్, మహానుభావుడు చిత్రాలు ఈ కోవకు చెందినవే. ఇక ఆయన గత చిత్రం ప్రతిరోజూ పండగే సూపర్ హిట్ గా నిలిచింది. ధరమ్ తేజ్, రాశిఖన్నా జంటగా తెరకెక్కిన ఈ మూవీ క్రిస్మస్ కానుకగా విడుదలై అతిపెద్ద హిట్ సాధించింది.

ప్రతిరోజూ పండగే మూవీలో కామెడీ మరియు ఎమోషన్స్ బాగా వర్క్ అవుట్ అయ్యాయి. కాగా మారుతి తన తదుపరి చిత్ర స్క్రిప్ట్ కూడా ఫ్యామిలీ సెంటిమెంట్ తో సిద్ధం చేస్తున్నాడట. ప్రతిరోజూ పండగే చిత్రంలో చావుని, చివరి రోజులను సెలెబ్రేట్ చేసుకోవాలని చెప్పిన మారుతీ తన తదుపరి చిత్రంలో ఉమ్మడి కుటుంబాల ప్రాధాన్యం తెలిపేలా మంచిఫ్యామిలీ డ్రామా సెట్ చేస్తున్నారట. ఈ మూవీ కూడా యూవీ క్రియేషన్స్ మరియు జి ఏ 2 నిర్మిస్తుండగా హీరో ఫైనల్ కాలేదు. ఐతే ఈ మూవీ అల్లు అర్జున్ కి కూడా సెట్ అవుతుందని ఆయన అంటున్నారు.

తాజా వార్తలు