స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించనున్న ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. డిసెంబర్ 12 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం. ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ లలో జరగబోయే లాంగ్ షెడ్యూల్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సినిమాలో బన్ని అమలా పాల్ మరియు కేథరిన్ తెరిసాలతో రొమాన్స్ చేయనున్నాడు.
చాలా ఫ్రెష్ ఫీల్ తో ఉండే రొమాంటిక్ ఎంటర్టైనర్ అని అందరూ అంచనా వేస్తున్నారు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పై బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు. ప్రఖ్యాత అమోల్ రాథోడ్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్న ఈ సినిమాకి రవీందర్ ఆర్ట్ డైరెక్టర్.