డిసెంబర్ 14న యమహో యమః

డిసెంబర్ 14న యమహో యమః

Published on Dec 3, 2012 4:14 PM IST


రియల్ స్టార్ శ్రీ హరి మరియు సాయిరామ్ శంకర్ ప్రధాన పాత్రల్లో రానున్న సోషియో ఫాంటసీ కామెడీ ఎంటర్టైనర్ ‘యమహో యమః’ పార్వతి మెల్టన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా డిసెంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ముందుగా ఈ సినిమాని డిసెంబర్ 7న విడుదల చేయాలనుకున్నారు కానీ అది కాస్తా వాయిదా పడి డిసెంబర్ 14న విడుదల కానుంది. జి.వి.కె ఆర్ట్స్ బ్యానర్ వారు నిర్మించిన ఈ సినిమాకి మహతి సంగీతం అందించాడు. కథానుసారం సినిమాలో యమ అమెరికా వీధుల్లో తిరగాల్సి ఉంటుంది అందుకే ఈ సినిమాని ఎక్కువ భాగం అమెరికాలో షూట్ చేసారు. జితేందర్ వై ఈ సినిమాకి డైరెక్టర్.

తాజా వార్తలు