రానా దగ్గుబాటి హీరోగా నటించిన ‘కృష్ణం వందే జగద్గురుమ్’ తను నటించిన సినిమాల్లో ఉత్తమ చిత్రంగా నిలిచిపోనుంది. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా కలెక్షన్స్ చాలా బాగున్నాయి. ఓవర్సీస్ ఏరియాల్లో మరియు ఎ సెంటర్లలో కలెక్షన్స్ చాలా బాగున్నాయి. ఈ మూడు రోజుల్లో కొన్ని ఏరియాల్లో వచ్చిన కలెక్షన్స్ మీకందిస్తున్నాం. మాకు ఇంకా కొన్ని ఏరియాల కలెక్షన్స్ రిపోర్ట్ రావాల్సి ఉంది రాగానే అవి కూడా అందిస్తాము.
ఏరియా | – | షేర్ |
ఉత్తరాంధ్ర | – | 39 లక్షలు |
తూర్పు గోదావరి | – | 23.5 లక్షలు |
పశ్చిమ గోదావరి | – | 21.47 లక్షలు |
కృష్ణా | – | 28.12 లక్షలు |
గుంటూరు | – | 31 లక్షలు |
సీడెడ్ | – | 66.86 లక్షలు |
నైజాం | – | 1.75 కోట్లు |
యు.ఎస్.ఎ | – | 1.02 కోట్లు (అన్ని స్క్రీన్స్ లో 2 రోజుల కలెక్షన్స్) |
రానా సరసన నయనతార హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందించగా, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు.