రజినీకాంత్ ని డైరెక్ట్ చెయ్యనున్న కేవీ ఆనంద్?

రజినీకాంత్ ని డైరెక్ట్ చెయ్యనున్న కేవీ ఆనంద్?

Published on Dec 2, 2012 8:02 PM IST

కోలీవుడ్ వర్గాల ప్రకారం రజినీకాంత్ తరువాత చిత్రం కే వి ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కనుంది. గతకొన్ని వారాల పాటు కోలీవుడ్లో సమాచారం ప్రకారం చాలా పుకార్లే ఉన్నాయి కాని కేవీ ఆనంద్ మరియు రాజమౌళి ముందు వరసల్లో నిలబడ్డారు కాని రాజమౌళి ఈ పుకార్లను ఖండించారు ఇప్పటికే తన చేస్తున్న చిత్రాల మీద దృష్టి సారిస్తున్నట్టు తెలిపారు. కేవీ ఆనంద్ ఈ చిత్రం కోసం కాస్టింగ్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు ఈ చిత్రం గురించిన అధికారిక ప్రకటన త్వరలో చెయ్యనున్నారు. ఈ మధ్య కాజల్,సూర్య ప్రధాన పాత్రలలో వచ్చిన “బ్రదర్స్” చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద అంతగా ప్రభావం చూపించకపోయినా దర్శకుడిగా ఇప్పటికే కేవీ ఆనంద్ తనని తాను నిరూపించుకున్నారు. రజినీకాంత్ త్వరలో సౌందర్య రజినీకాంత్ దర్శకత్వంలో రానున్న “విక్రమసింఘ” చిత్రంలో కనిపించనున్నారు ఈ చిత్రం 2013 వేసవిలో విడుదల కానుంది.

తాజా వార్తలు