కమల్ హాసన్ రాబోయే చిత్రం “విశ్వరూపం” మీద వస్తున్న పుకార్లను బట్టి చూస్తుంటే చిక్కుల్లో పడేట్టు తెలుస్తుంది. ఈ చిత్రాన్ని తమిళనాడులో నిషేదించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి విషయనికోస్తే ఈ చిత్రాన్ని కమల్ హాసన్ నేరుగా ఎయిర్ టెల్ ,టాటా స్కై వంటి DTH సంస్థలతో 50 కోట్ల డీల్ చేసుకున్నారు దీని ప్రకారం ఈ సంస్థలు చిత్ర విడుదల రోజే చిత్రాన్ని టీవీలలో ప్రదర్శించవచ్చు. దీనివలన డిస్ట్రిబ్యుటర్స్ నష్టాల పాలవుతారని భావించిన తమిళనాడు డిస్ట్రిబ్యుటర్స్ ఈ చిత్రాన్ని విడుదల రోజు టీవిలో ప్రదర్శించడానికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోవట్లేదు. దీని గురించి కమల్ హాసన్ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.
కమల్ హాసన్, ఆండ్రియా, పూజ కుమార్ మరియు శేఖర్ కపూర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ఉగ్రవాద నేపధ్యంలో ఉండబోతుంది. ఈ చిత్రాన్ని కమల్ హాసన్ రచించి స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఈ చిత్రం తెలుగు,తమిళ మరియు హిందీలలో జనవరి 11న విడుదల కానుంది.