కమల్ సూపర్ హిట్ సీక్వెల్ లో నయనతార ?

కమల్ సూపర్ హిట్ సీక్వెల్ లో నయనతార ?

Published on Apr 12, 2020 11:22 PM IST

గ్రేట్ యాక్టర్ కమల్ హాసన్ సూపర్ హిట్ చిత్రాల్లో ‘రాఘవన్’ కూడా ఒకటి. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం తెలుగులో కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు సీక్వెల్ రూపొందనుందనే వార్తలు మొదట్లో రూమర్లే అనుకున్నా ఇప్పుడు మాత్రం నిజమేనని అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. ఈ సినిమాలో కథానాయకిగా అనుష్క నటించబోతుందని ఇప్పటికే వార్తలు కూడా వచ్చాయి. కాగా తాజాగా సినీ వర్గాలు సమాచారం ప్రకారం ఈ సినిమాలో నయనతార పేరు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయమై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.

మరో పక్క నయనతార కంటే కూడా అనుష్కనే ఫైనల్ చెయ్యొచ్చు కోలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇకపోతే గతంలో అనుష్క గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందిన ‘యెన్నై ఆరిందాల్’ చిత్రంలో నటించగా వీరి కాంబోలో ఒక లేడీ ఒరియెంటెడ్ చిత్రంలో నటించాల్సి ఉండగా అది వర్కవుట్ కాలేదు. మళ్లీ ఇప్పుడు ‘రాఘవన్ -2’ లో నటిస్తుంది. కమల్ హాసన్ ‘ఇండియన్ 2’ చిత్ర షూటింగ్ పూర్తయ్యాక ఈ చిత్రాన్ని పట్టాలెక్కించనున్నారు.

తాజా వార్తలు