సిద్దార్థ్ సరసన ‘టాక్సీవాలా’ బ్యూటీ ?

సిద్దార్థ్ సరసన ‘టాక్సీవాలా’ బ్యూటీ ?

Published on Apr 10, 2020 3:33 PM IST

తెలుగులో ‘టాక్సీవాలా’ చిత్రంతో కథానాయకిగా పరిచయమైన నటి ప్రియాంక జావాల్కర్. ఆ చిత్రంతో ఆమెకు మంచి మార్కులే పడ్డాయి. ఆ సినిమా విజయం సాధించడంతో ఆమెకు పెద్ద ఆఫర్లు కూడా వచ్చాయని వార్తలు వచ్చాయి. కానీ సినిమాలేవీ సెట్ కాలేదు. ప్రస్తుతం తెలుగులో ఒక చిన్న సినిమా మాత్రమే చేస్తోంది. అయితే ఆమెకు కోలీవుడ్లో మంచి ఛాన్స్ ఒకటి దొరికినట్టు తెలుస్తోంది.

సిద్దార్థ్ హీరోగా అమృతరాజ్ అనే దర్శకుడు కొత్త సినిమాను డైరెక్ట్ చేయనున్నాడు. ఇందులో సిద్దార్థ్ రెండు పాత్రల్లో కనిపించనున్నాడు. అందుకే ఇందులో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని, వారిలో ఒకరు నివేథా థామస్ కాగా మరొకరు ప్రియాంక జవాల్కర్ అని తెలుస్తోంది. ఈ వార్తే గనుక నిజమైతే ఆమెకు మంచి ఆఫర్ దొరికినట్టే అవుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు