స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ చెఫ్ గా మారింది. ఆమె వంట గదికి పరిమితమై సమోసాలు చేస్తుంది. కరోనా కర్ఫ్యూ కారణంగా సెలెబ్రిటీల నుండి సామాన్యుల వరకు ఇంటికే పరిమితం కావాల్సిన పరిస్థితి. ఖాళీగా ఇంటిలో ఉంటున్న హీరో హీరోయిన్స్ తమకు ఇష్టం వచ్చిన వ్యాపకాలలో మునిగిపోతున్నారు. కొందరు సినిమాలు చూస్తుంటే, మరికొందరు పుస్తకాలు చదువుతున్నారు. కొందరు గార్డెనింగ్ మరి కొందరు తమ పిల్లలతో ఆడుకుంటున్నారు. ఇక హీరోయిన్ కాజల్ తనకు ఇష్టమైన సమోసాలు చేస్తుంది. ఆ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకుంటుంది.
కాజల్ ప్రస్తుతం తెలుగులో చిరంజీవికి జంటగా ఆచార్య చిత్రంలో చేస్తున్నారు. అలాగే మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న క్రైమ్ థ్రిల్లర్ మోసగాళ్లు చిత్రంలో కూడా చేస్తుంది. దీనితో పాటు కమల్ హాసన్ హీరోగా దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న భారతీయుడు 2 మూవీలో కూడా హీరోయిన్ గా నటిస్తున్నారు.
https://www.instagram.com/p/B-ywsOznoad/