మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్ లో వస్తోన్న ఆచార్య సినిమా కోసం చరణ్ ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఆర్‌ఆర్‌ఆర్ షూటింగ్ పోస్ట్ ఫోన్ కారణంగా.. లాక్ డౌన్ ముగిశాక డేట్స్ మొత్తం ఆర్ఆర్ఆర్ కే కేటాయించాల్సి రావడంతో ఇక చరణ్ ఆచార్యలో నటించ అవకాశం లేదనుకున్నారు. అయితే ఆచార్యలో ప్రత్యేక పాత్రలో నటించాలనుకుంటున్నట్లు చరణ్, రాజమౌళితో చెప్పాడట. రాజమౌళి కూడా అందుకు ఓకే అని అయితే రెండు సినిమాలు చేసేలా డేట్స్ సద్దుబాటు చేసుకుందామని.. నువ్వు ఆచార్యలో యాక్ట్ చెయ్ అని జక్కన్న చరణ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. దాంతో చరణ్ ఆచార్య సినిమా కోసం మూడు వారాలు డేట్స్ కేటాయించినట్లు తెలుస్తోంది.
కాగా ఈ చిత్రంలో రామ్ చరణ్ మాజీ నక్సలైట్ గా కనిపిస్తారట. సినిమాలో చరణ్ పాత్ర త్యాగం చేసే పాత్రగా ఉంటుందని, చిరు పాత్రకు చరణ్ పాత్ర ప్రేరణగా నిలుస్తోందని తెలుస్తోంది. చరణ్ రోల్ సినిమాలో దాదాపు ఇరవై నిముషాల పాటు సినిమాలో కనిపిస్తారని.. అందులో పదిహేను నిముషాల పాటు మెగాస్టార్ తో కాంబినేషన్ సీన్స్ ఉంటాయని సమాచారం. ఇక మెగాస్టార్ ఈ చిత్రం కోసం బరువు తగ్గడంతో పాటు చాలా మేక్ ఓవర్ అయ్యారు. ఈ సినిమాలో మెగాస్టార్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.