రంగంలోకి దిగిన మహేష్ కూతురు సితార.

రంగంలోకి దిగిన మహేష్ కూతురు సితార.

Published on Mar 27, 2020 5:48 PM IST


కరోనా వ్యాప్తిని అరికట్టే పనిలో భాగంగా ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. అలాగే టాలీవుడ్ స్టార్ హీరోలందరూ రెండు తెలుగు రాష్ట్రాలకు మద్దతుగా ఆర్ధిక సాయం ప్రకటించడం జరిగింది. కరోనా పై యుద్ధంలో మహేష్ గారాల పట్టి సితార కూడా భాగమయ్యారు. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి తీసుకోవలసిన జాగ్రత్తలను ఓ వీడియో ద్వారా తెలియజేశారు.

ఇంత చిన్న వయసులోనే సామజిక విషయాల పట్ల స్పందిస్తున్న సితారను ఎవరైనా మెచ్చుకోవలసిందే.గతంలో కూడా ఇకో ఫ్రెండ్లీ మట్టి వినాయకుడికి పూజ చేయాలని సితార డైరెక్టర్ వంశీ పైడిపల్లి కూతురు ఆద్యతో కలిసి ఓ వీడియో చేయడం జరిగింది. సితార మరియు ఆద్య కలిసి ఓ యూ ట్యూబ్ ఛానల్ రన్ చేయడం విశేషం.

తాజా వార్తలు