కరోనా వైరస్ మొత్తం ప్రపంచంలో ఒక రకమైన భయానిక వాతావరణాన్ని సృష్టించింది. దాంతో కరోనా కలకలంతో ప్రపంచ దేశాలు బెంబేలెత్తిపోతున్నాయి. ప్రభుత్వాలతో పాటు సినీ ప్రముఖులు కూడా కరోనా పట్ల ప్రజలను మరింత అప్రమత్తం చేస్తున్నారు. ఈ క్రమంలో రేపు జనతా కర్ఫ్యూ ని కూడా నిర్వహించబోతున్న సంగతి తెలిసిందే.
కాగా జూనియర్ ఎన్టీఆర్ ఈ జనతా కర్ఫ్యూ గురించి తాజాగా ట్వీట్ చేశారు. ‘కరోనాని జయించాలంటే అందరం మనవంతు కృషి చేయాలి. రేపు జరిగే జనతా కర్ఫ్యూ ని విజయవంతం చేసి మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం’ అని ఎన్టీఆర్ పోస్ట్ చేశారు.
ఇక ఇప్పటికే ఎన్టీఆర్ చరణ్ తో కలిసి కరోనా సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేస్తూ ఒక వీడియోను రిలీజ్ చేశారు. ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉండాలని మరియు సురక్షితంగా ఉండాలని అలాగే సామాజిక దూరం పాటించాలని ఆ వీడియోలో ఎన్టీఆర్ కోరిన సంగతి తెలిసిందే.
#covid19 ని జయించాలంటే అందరం మనవంతు కృషి చేయాలి. రేపు జరిగే జనతా కర్ఫ్యూ ని విజయవంతం చేసి మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.
— Jr NTR (@tarak9999) March 21, 2020